మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. శాస్త్రీయ సమాచారం ఆధారంగా 135కోట్ల మంది భారతీయులకు పంపిణీ విషయంలో సమాన ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
కొవిడ్ తర్వాత ఆరోగ్య వ్యవస్థలో మార్పులపై 'ఫిక్కీ ఎఫ్ఎల్ఓ' నిర్వహించిన వెబినార్లో హర్షవర్ధన్ మాట్లాడారు.
"25, 30 కోట్ల మందికి సరిపడే 40, 50 కోట్ల డోసులు వచ్చే జులై-ఆగస్టు నాటికి వచ్చే అవకాశం ఉంది. సహజంగానే కరోనా యోధులు, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. టీకా పంపిణీకి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధమవుతోంది."