తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వైద్యుల పాటకు నెటిజన్లు ఫిదా

విజృంభిస్తున్న మహమ్మారి... అంతకంతకూ పెరుగుతున్న పనిభారం... దాదాపు రోజంతా విధులు నిర్వర్తించాల్సిన అవసరం... తమకు, తమ కుటుంబసభ్యులకూ ప్రమాదం... అయినా ఏమాత్రం భయపడకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు, సిబ్బంది. అయితే... పని ఒత్తిడిని మర్చిపోయి, మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ఓ చిరు ప్రయత్నం చేసింది రాజస్థాన్ వైద్య బృందం. నెట్టింట అందరూ మన్ననలు అందుకుంటోంది.

Health workers sing a song to keep up the spirit coronavirus victims
కరోనా బాధితుల కోసం గాయకులుగా మారిన వైద్యులు

By

Published : Mar 27, 2020, 11:28 AM IST

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. వారి ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతోంది. అయినా ఏమాత్రం భయపడకుండా, ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నారు వారంతా.

రాజస్థాన్​ భిల్వారాలో ఇలాంటి ఓ బృందం తమతోపాటు దేశంలోని ఇతర వైద్యులు, సిబ్బందిలో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేసింది. 'హమ్​ హందూస్థానీ' పాట పాడింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతుంది.

కరోనా వ్యాప్తి నియంత్రించడానికి 21రోజలు లాక్​డౌన్​ అమలు చేస్తోంది భారత ప్రభుత్వం. దేశంలో ఇప్పటివరకు 724మంది వైరస్​ బారిన పడగా 17మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:ఒకే వెంటిలేటర్‌తో అనేక మందికి సేవలు

ABOUT THE AUTHOR

...view details