తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జిమ్‌, యోగా కేంద్రాల్లో ఇక కొత్త రూల్స్ - gym guidelines

ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకుంటున్న నేపథ్యంలో.. వీటి నిర్వహణపై విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు మూసి ఉంచాలని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 6 అడుగుల దూరం పాటించాలని. ఫేస్‌ గార్డ్స్‌/మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది.

HEALTH-VIRUS-GYM GUIDELINES
జిమ్‌, యోగా కేంద్రాలకు మార్గదర్శకాలు విడుదల

By

Published : Aug 3, 2020, 6:31 PM IST

కొద్ది రోజుల క్రితం మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు కేంద్రం హోం శాఖ అనుమతించింది. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు. కేవలం వాటి వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన విధి విధానాలు జిమ్‌లు, యోగా కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • 65 ఏళ్ల వయస్సు వారు, అనారోగ్య సమస్యలున్నవారు గర్భిణీలు, పదేళ్ల వయస్సు లోపు పిల్లలను జిమ్‌, యోగా కేంద్రాల్లోకి అనుమతించకూడదు.
  • ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 6 అడుగుల దూరం పాటించాలి. ఫేస్‌ గార్డ్స్‌/మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. యోగా/వ్యాయామం వంటివి చేసేప్పుడు మాత్రం ఫేస్‌ గార్డ్‌ ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వ్యాయామం చేసే సమయంలో ఎన్‌-95 మాస్క్‌లు ధరించకపోవడం మేలు.
  • సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం వంటివి తరచుగా చేస్తుండాలి. అలానే దగ్గు, జలుబు వంటి వచ్చినప్పడు టిష్యూ, చేతి రుమాలుతో, మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి, ఉమ్మటం వంటివి చేయకూడదు. ఆరోగ్య సేతు యాప్‌ ప్రతి ఒక్కరు ఉపయోగించడం ఉత్తమం.
  • వ్యాయమాలు చేసేప్పుడు ప్రతి వ్యక్తికి మధ్య 4 చదరపు మీటర్ల దూరంతో పాటు, జిమ్‌లోని ఫిట్‌నెస్‌ సామాగ్రి మధ్య కూడా 6 అడుగుల దూరం ఉండేలా చర్యలు చేపట్టాలని సదరు యాజమాన్యాలకు సూచించారు.
  • ఎయిర్‌కండిషన్డ్‌ ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంచడం సహా ప్రవేశ, నిష్క్రమణలకు రెండు దార్లు ఉపయోగించడం మేలని పేర్కొన్నారు. ప్రతి రోజు తప్పని సరిగా డిస్‌ఇన్ఫెక్షన్‌ స్ప్రే చేయించాలని ఆదేశించారు.
  • యోగా శిక్షణలో పాల్గొనే వారి సంఖ్య ఆధారంగా, శిక్షణ తరగతులు షెడ్యూల్ చేసుకోమని సూచించారు. అలానే ప్రతి శిక్షణ తరగతి మధ్య 15 నుంచి 30 నిమిషాల వ్యవధి ఉండాలి.
  • స్పా, స్టీమ్‌ బాత్‌, స్విమ్మింగ్ పూల్ వంటివి మూసి ఉంచాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details