ధూమపానం.. సరదా కోసం అలవాటు చేసుకున్నప్పటికీ ఓ వ్యసనంగా మారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే మహమ్మారి. ఎక్కువ శాతం మంది యువతే దీని బారిన పడుతున్నారు. పొగ తాగటం ఓ ఫ్యాషన్‌గా భావించి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్యాన్సర్ వంటి జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు.
ధూమపానాన్ని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు వేసేందుకు కసరత్తు ప్రారంభించింది. పొగాకు వినియోగించే వారి కనీస వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని యోచిస్తోంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టంలోని నిబంధనలను ఈమేరకు కఠినతరం చేయాలని భావిస్తోంది.
న్యాయ నిపుణుల బృందం సిఫార్సులు..
పొగాకు నియంత్రణ చట్టాన్ని సవరించడంపై న్యాయ నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఆరోగ్యమంత్రిత్వ శాఖ. ఇటీవల సమావేశమైన ఆ బృందం కొన్ని సిఫార్సులను చేసింది.
- పొగాకు వినియోగం తగ్గించేందుకు ప్రధానంగా ధూమపానం చేసేందుకు వయో పరిమితి మార్చడం అవసరం. ప్రస్తుతం ఉన్న వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని సిఫార్సు.
- నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు భారీగా పెంపు.
- పొగాకు, దాని ఉత్పత్తులను అక్రమంగా అమ్మినవారిని గుర్తించడానికి వీలుగా ట్రాకింగ్ విధానం తీసుకురావటం.
- పొగాకు ఉత్పత్తులను చట్టబద్ధంగా గుర్తించేందుకు వీలుగా వాటిపై బార్కోడ్ ముద్రించటం. దీంతో పన్నుల వసూలుకూ వీలు కలుగుతుందని అభిప్రాయం.
17.9 ఏళ్లకే పొగాకు వినియోగం..