దేశంలో అన్లాక్ 1.0 కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నూతన మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. కార్యాలయాలు, హోటళ్లు, గుళ్లు- ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలను సూచించింది. అన్ని ప్రదేశాల్లో మాస్కులు, ప్రవేశద్వారాల్లో శానిటైజర్లను తప్పనిసరి చేసింది. భౌతికదూరం నిబంధనలను కచ్చితంగా పాటించాలని వెల్లడించింది.
కార్యాలయాల్లో..
శరీర ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్ ఉన్నవారినే కార్యాలయాల్లోకి అనుమతించాలని కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు విధిగా యాజమాన్యానికి తమ ఆరోగ్య వివరాలను తెలపాలి.
గుళ్లు-ప్రార్థనాస్థలాల్లో..
ప్రజలు లోపలికి వచ్చేందుకు.. బయటకు వెళ్లేందుకు వేర్వేరు దారులను ఏర్పాటు చేయాలి. మాస్కులు ధరిస్తేనే మత ప్రదేశాల్లోకి అనుమతించాలి.