కరోనా వైరస్‌ను కట్టడి చేసేందకు దృష్టిసారించింది కేంద్రం. వ్యక్తిగత రక్షణ కిట్లు(పీపీఈ) అందుబాటుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఉన్నవాటిని సరైన రీతిలో ఉపయోగించాలని సూచించింది. త్వరలో మరిన్ని కిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాలను ఆదేశించింది. ఇప్పటివరకు 1,30,000 పరీక్షలు నిర్వహించామని.. పాజిటివ్‌గా తేలుతున్న వారి శాతం 3-5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది.
రైల్వే బోగీలు సిద్ధం..
వైరస్ బాధితుల కోసం 3250 బోగీలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. మొత్తంగా 5000 వేల కోచ్‌లను సిద్ధం చేయనున్నట్లు స్పష్టం చేసింది. రైల్వే విభాగంలోని 2500 మంది వైద్యులను కరోనా సేవల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పింది. రైల్వేల ద్వారా 6 లక్షల మాస్కులను, 4000 లీటర్ల శానిటైజర్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పింది.