దేశంలో కొత్తగా 149మందికి కరోనా సోకిందని వెల్లడించారు కేంద్ర వైద్య శాఖ అధికారులు. వైరస్ సోకిన వారి సంఖ్య మొత్తంగా 873కు చేరిందని చెప్పారు. మృతుల సంఖ్య 19కి చేరినట్లు స్పష్టం చేశారు. వైరస్‌ను అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా వైరస్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నారు వైద్య శాఖ అధికారులు. వారిలో రోగ నిరోధక శక్తి పెంచే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు. సామాజిక దూరం, లాక్ డౌన్ పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పునరుద్ఘాటించారు.
ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స..
కరోనా వైరస్‌కు మాత్రమే సేవలందించే ఆసుపత్రులను గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు ఆరోగ్య శాఖ అధికారులు. ఈ దిశగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.
వారందరికీ పరీక్షలు..
తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కరోనా వ్యాధి నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వృద్ధులు ఎక్కువగా ఈ వైరస్‌తో ప్రభావితమవుతున్నారని ప్రపంచ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని.. వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ నియంత్రణ వ్యాక్సిన్‌ను మానవులపై ప్రయోగించే దశకు ప్రపంచ దేశాల పరిశోధనలు ఇంకా చేరలేదని పేర్కొన్నారు.
ప్రైవేటు ల్యాబ్‌ల ద్వారా