అఖిల భారత కెమిస్ట్, డ్రగిస్ట్ అసోసియేషన్‌కు(ఏఐఓసీడీ) దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై లేఖ రాసింది కేంద్రం. ఏఐఓసీడీలో సభ్యత్వం తీసుకున్న ఔషధశాలల్లో వైరస్‌కు ఉపయోగించే మందులు సహా.. మరికొన్ని అత్యవసర ఔషధాలు తప్పక అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
వైరస్ బాధితులకు అత్యవసరమైన 55 ఔషధాలు, 96 ఇతర ఔషధాలకు సంబంధించిన జాబితాను ఏఐఓసీడీకి పంపింది కేంద్రం. వైద్య సిబ్బంది సహా కరోనా బాధితులతో కలిసిన వారికి రోగ నిరోధక శక్తి పెంచేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉపయోగించవచ్చని లేఖలో సూచించింది కేంద్రం.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉంచి (ఐసీయూ) చికిత్స చేయాల్సిన వైరస్ బాధితులకు హెడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ను కలిపి అందించవచ్చన్న ఆరోగ్యశాఖ.. పరిశోధనల దశలో ఉన్న మరికొన్ని ఔషధాలను భారత్‌లో ఇప్పుడే సిఫారసు చేయలేమని స్పష్టంచేసింది.