తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ విలయం: 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు! - Health Minister Harsh Vardhan chairs GoM meeting on COVID-19

భారత్​లో కొవిడ్​ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్​ కేసులు నమోదవుతూ.. కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు వెలుగుచూశాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు.

Health Minister Harsh Vardhan chairs GoM meeting on COVID-19
21 రోజుల్లోనే రెట్టింపు కేసులు!

By

Published : Jul 31, 2020, 8:16 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్న తరుణంలో దేశంలో రికవరీ రేటు 65.54శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 16లక్షల 38వేల మందికి వైరస్​ సోకగా.. వీరిలో ఇప్పటివరకు 10లక్షల 57వేల మంది కోలుకున్నట్లు తెలిపారు హర్షవర్ధన్. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 21రోజుల సమయం పడుతున్నట్లు దిల్లీలోని మంత్రివర్గ సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

'దేశంలో కరోనా సోకిన వారిలో మూడింట రెండొంతుల మంది కోలుకొని ఇంటికి చేరారు. మరణాల రేటు కూడా తగ్గుతోంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల రేటు 2.18 గా ఉంది. అంతేకాకుండా రికవరీ రేటు 64.54 శాతానికి పెరిగింది.'

- డాక్టర్​ హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

21 రోజుల్లోనే డబ్లింగ్​..

ఇదే సమయంలో కరోనా డబ్లింగ్‌ రేటు కూడా 21రోజులుగా ఉందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 24గంటల్లో 6,42,588 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేశామని.. గడిచిన నెల కాలంలో సుమారు కోటి కరోనా నిర్ధరణ పరీక్షలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. మొత్తం బాధితుల్లో 0.27 శాతం మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో 1.58 శాతం మంది అత్యవసర చికిత్సా విభాగంలో ఉన్నట్లు మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. వీరితోపాటు మరో 2.28 శాతం మందికి ఆక్సిజన్‌ అవసరమవుతున్నట్లు ఆయన తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు జైశంకర్‌, హర్​దీప్‌ సింగ్‌ పురీ పాల్గొని దేశంలో కొవిడ్​ తాజా పరిస్థితులపై చర్చించారు.

ఇదీ చదవండి:'అమ్మ తాళి తాకట్టు పెట్టి, మా కోసం టీవీ కొనేసింది!'

ABOUT THE AUTHOR

...view details