తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తబ్లీగీ జమాత్​ సభ్యుల తీరు సర్వత్రా వివాదాస్పదం

తబ్లీగీ జమాత్​ సభ్యులు.. వీరి పేరు వింటేనే దేశ ప్రజలు వణికిపోతున్నారు. కానీ వారిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దేశంలో జమాత్​ సభ్యుల తీరు సర్వత్రా వివాదాస్పదమవుతోంది. వైద్య పరీక్షలు, చికిత్సకు సహకరించకుండా పోలీసులు, వైద్యులు పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారు.

By

Published : Apr 4, 2020, 5:59 AM IST

Health minister concerned over misbehavior with doctors treating corona patients
జమాత్​ సభ్యలు తీరు సర్వత్రా వివాదస్పదం

తబ్లీగీ జమాత్​ సభ్యుల తీరు సర్వత్రా వివాదాస్పదమవుతోంది. దిల్లీ నిజాముద్దీన్​లో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన వారి వల్ల దేశంలో కరోనా పాజిటివ్​ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా జమాత్​ సభ్యుల తీరులో ఏమాత్రం మారడం లేదు. పోలీసులు, వైద్యులకు సహకరించకుండా నానా గందరగోళం సృష్టిస్తున్నారు. పోలీసులపై తిరగబడి దాడులకు పాల్పడిన ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి.

11మంది పరారీ

మహారాష్ట్రలోని పుణెలో 11మంది జమాత్​ సభ్యులకు వైరస్​ సోకిందని పోలీసులు అనుమానించారు. వారిని సమీప మసీదులోనే ఐసోలేషన్​లో ఉండాలని ఆదేశించారు. కానీ వారు ఆ మసీదు నుంచి తప్పించుకుని పారిపోయారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే వీరు దిల్లీలో జరిగిన సమావేశానికి హాజరు కాలేదని స్పష్టం చేశారు. వీరి వల్ల ముప్పు ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు.

లాక్​డౌన్​కు​ ముందే..

దిల్లీ నిజాముద్దీన్​ మర్కజ్​లో పాల్గొన్న వారు ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాలకు చేరుకున్నారు. ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో పడ్డాయి ఆయా రాష్ట్రాలు. తాజాగా హరియాణాలో 1300మంది తబ్లీగీ జమాత్​ సభ్యులను గుర్తించారు అధికారులు. అయితే వీరందరూ లాక్​డౌన్​కు ముందే రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు వివరించారు. మొత్తంగా 1305మంది ప్రవేశించగా.. వీరిలో 107 మంది విదేశీయులు ఉన్నట్లు వెల్లడించారు. అందులో 8 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు తెలిపారు.

వైద్యుల పట్ల దురుసుగా

మరోవైపు.. కరోనా బాధితులకు సాహసోపేతంగా చికిత్స అందిస్తోన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పట్ల కొందరు దురుసుగా ప్రవర్తిడంపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్​. వైద్యులపై దాడి జరిగితే.. రోగులకే నష్టమని, వారికి చికిత్స అందించడం ఆలస్యమవుతుందన్నారు. బుధవారం ఇండోర్​లోని తాట్​పత్తి బఖాల్​లో ఓ కరోనా రోగి బంధువులకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి వెళ్లిన ఐదుగురు వైద్యబృందంపై ఓ గుంపు రాళ్లతో దాడి చేసింది. ఆ నేపథ్యంలోనే హర్షవర్థన్ ఈ​ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి : మహారాష్ట్రపై కరోనా పంజా.. ఒక్క రోజులో ఆరుగురు బలి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details