పోలీసు కాల్పుల్లో గాయపడ్డ తన సోదరుడిని ఆసుపత్రికి తీసుకెళ్తే.. చికిత్స అందించకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని రాంపుర్‌కు చెందిన ఫైజన్ అహ్మద్ ఆరోపించారు. ఆసుపత్రిలో రెండు గంటల పాటు ఎలాంటి చికిత్స చేయని కారణంగానే తన సోదరుడు మరణించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పౌరసత్వ చట్ట సవరణకి వ్యతిరేకంగా శనివారం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా తమపై దాడి జరిగిన క్రమాన్ని ఫైజన్ వివరించారు.
‘‘కొందరం కలిసి బృందంగా ఈద్గాకు బయలుదేరాం. అదే సమయంలో అల్లర్లను నియంత్రించేందుకు పోలీసు కాల్పులు జరిపారు. తూటా నా సోదరుడు ఫయజ్ అహ్మద్ మెడకు తగిలింది. జిల్లా ఆసుపత్రికి వెళ్తే రెండు గంటల పాటు ఏ వైద్యుడూ రాలేదు. అనంతరం పోలీసులు ఫయజ్ను మురాదాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు’’