కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి సంబంధించిన ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్కు బదిలీ చేస్తూ దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులను ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ విచారించారు. ఈ నెలాఖరులో సైనీ పదవీకాలం ముగుస్తుండటం వల్ల దిల్లీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే కాంగ్రేస్ నేత డీకే శివకుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అయన కుటుంబ కేసులు, హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, అయన కుటుంబానికి సంబంధించిన కేసులు, ఇతర కేసులను కుహార్ విచారిస్తున్నారు. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ అక్టోబర్ 1 నుంచి ఈ ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులను పరిశీలిస్తారు.