తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​యూ ఘటనపై వాట్సాప్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు - JNU violence: Delhi HC issues notice to Apple, WhatsApp

జేఎన్​యూ ఘటనపై దిల్లీ ప్రభుత్వం, పోలీసులు సహా వాట్సాప్, గూగుల్​ తదితరులకు నోటీసుల జారీ చేసింది దిల్లీ హైకోర్టు. హింసాత్మక ఘటనకు సంబంధించిన డేటాను భద్రపరచాలని దాఖలైన పిటిషన్లపై వారి స్పందనలు కోరింది.

hc-seeks-response-of-police-whatsapp-google-on-plea-to-preserve-data-of-jnu-violence
జేఎన్​యూ ఘటనపై వాట్సాప్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు

By

Published : Jan 13, 2020, 4:37 PM IST

జేఎన్​యూ ఘటనకు సంబంధించిన ఆధారాలను భద్రపరచాలని ధాఖలైన పిటిషన్​పై స్పందిచాల్సిందిగా.. దిల్లీ ప్రభుత్వం, పోలీసులు సహా వాట్సాప్​, గూగుల్​, యాపిల్​ సంస్థలకు నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. ఈ అంశంపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు జస్టిస్​ బ్రిజేశ్​ సేతి.

ఈ నెల 5న జరిగిన జేఎన్​యూ ఘటనకు సంబంధించి ప్రొఫెసర్లు అమీత్​ పరమేశ్వరన్​, అతుల్​ సూద్​, శుక్లా వినాయక్​ సావంత్ ఈ పిటిషన్ వేశారు. ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా దిల్లీ ప్రభుత్వానికి, పోలీస్​ కమీషన్​లకు సూచించాలని కోరారు. ఈ పిటిషన్​లో జేఎన్​యూ క్యాంపస్​లోని అన్నీ సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని పేర్కొన్నారు.

ఈ అంశమై.. జేఎన్​యూ అధికారులను వర్సిటిలోని అన్ని సీసీటీవీ దృశ్యాలు సేకరించి, అప్పగించాల్సిందిగా కోరినట్టు దిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అయితే, ఇప్పటివరకు వర్సిటీ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

విశ్వవిద్యాలయంలోని 'యునిటీ ఎగెయిన్​స్ట్​ లెఫ్ట్', 'ఫ్రెండ్స్​ ఆఫ్ ఆర్ఎ​స్ఎస్'​ అనే రెండు బృందాలకు సంబంధించిన​​ డేటాను భద్రపరచాలని వాట్సాప్​ను కోరినట్లు.. దిల్లీ ప్రభుత్వం స్టాండింగ్​ కౌన్సిల్​ తెలిపింది. సందేశాలు, వీడియోలు, ఫోన్​ నంబర్లతో సహా అన్ని వివరాలు సేకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ జరిగింది

జనవరి 5వ తేదీ రాత్రి కొందరు ఆగంతుకులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ముసుగులు ధరించి కర్రలు, ఇనుప రాడ్లు వంటివాటితో విరుచుకుపడ్డారు. వసతి గృహాల్లోని అద్దాలు, ఫర్నీచర్‌, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ సహా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడింది మీరంటే మీరంటూ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

ఇదీ చదవండి:40వేల కిమీ.. 1500 అమర జవాన్ల కుటుంబాలు.. ఓ బాలుడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details