తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మాజీ ప్రజాప్రతినిధులందరకీ రెండు వారాలే గడువు' - ex MPs bungalows news

మాజీ ప్రజాప్రతినిధులు, పదవీ విరమణ పొందిన అధికారులు ప్రభుత్వ భవనాల్లో అక్రమంగా నివసిస్తున్నారని దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా వీరందరినీ ఖాళీ చేయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మందలించింది.

HC rebukes Centre for illegally occupied govt bungalows
గృహమంత్రిత్వ శాఖపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం

By

Published : Feb 5, 2020, 8:15 PM IST

Updated : Feb 29, 2020, 7:40 AM IST

ప్రభుత్వానికి చెందిన 550కుపైగా వసతి గృహాల్లో మాజీ ప్రజా ప్రతినిధులు, పదవీ విరమణ పొందిన అధికారులు చట్టవిరుద్ధంగా నివసిస్తుండటంపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోనందుకు గృహ మంత్రిత్వశాఖను మందలించింది. రెండు వారాల్లోగా గృహాలను ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మాజీ ప్రజా ప్రతినిధులు, రిటైర్డ్‌ అధికారులు చట్ట విరుద్దంగా ప్రభుత్వ బంగళాల్లో నివసిస్తున్నారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం... ప్రభుత్వ వసతి గృహాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడానికి అనుమతించడం కుట్రతో సమానమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ గృహాల్లో అక్రమంగా నివసిస్తున్నవారు చెల్లించాల్సిన లక్షల రూపాయల బకాయిలను వసూలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రూ.10 వేల జరిమానా విధించింది.

ఇదీ చూడండి: 'సామాజిక మాధ్యమాలకు ఆధార్ లింక్.. నిజంకాదు' ​

Last Updated : Feb 29, 2020, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details