తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్ధవ్​ ప్రమాణ స్వీకారంపై బొంబాయి హైకోర్టు 'ఆందోళన'

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఉద్ధవ్​ ఠాక్రే శివాజీ పార్కును వేదికగా ఎంచుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది బొంబాయి హైకోర్టు. రాజకీయ వేడుకల కోసం బహిరంగ ప్రదేశాలు వినియోగించడం సాధారణ విషయంగా మారకూడదని అభిప్రాయపడింది.

HC raises security concern over Uddhav's oath ceremony at   Shivaji Park
ఉద్ధవ్​ ప్రమాణ స్వీకారంపై బొంబాయి హైకోర్టు 'ఆందోళన'

By

Published : Nov 27, 2019, 3:02 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుక కోసం ముంబయిలోని శివాజీ పార్కు ముస్తాబవుతోంది.

ప్రమాణస్వీకార మహోత్సవానికి సంబంధించిన భద్రతాపరమైన అంశాలపై బొంబాయి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వేడుకల కోసం బహిరంగ మైదానాలు వినియోగించడం ట్రెండ్​గా మారకూడదని అభిప్రాయపడింది.

వేడుకలు చేసుకోవడానికి శివాజీ పార్కు.. మైదానమా? లేక వినోదాత్మక ప్రాంగణమా అని ప్రశ్నిస్తూ వికామ్​ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ​ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

"రేపు జరగనున్న వేడుకపై మేము ఏమీ మాట్లాడం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని ప్రార్థిస్తున్నాం. కానీ ఈ తరహా వేడుకలను పార్కుల్లో నిర్వహించడం సాధారణం అయిపోయింది. వేడుకల కోసం ఇలాంటి మైదానాలనే వినియోగిస్తున్నారు."
--- బొంబాయి హైకోర్టు.

2010లో పార్కు ప్రాంగణాన్ని 'సైలెన్స్​ జోన్​'గా ప్రకటించింది హైకోర్టు.

ఇదీ చూడండి:- మంచు కురిసెన్- బడికి సెలవు వచ్చెన్

ABOUT THE AUTHOR

...view details