కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారి 'కె బిజు'కు ఊహించని శిక్ష విధించింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఆదాయపు పన్నుకు సంబంధించి ఓ ప్రైవేటు రసాయన పరిశ్రమ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. బిజు 100 మొక్కలు నాటాల్సిందిగా తీర్పునిచ్చింది. ఆదాయపన్నులో రసాయన పరిశ్రమకు మినహాయింపునిస్తూ.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో ఆలస్యం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
కోర్టు అనూహ్య తీర్పు.. 100 మొక్కలు నాటాలని ఆదేశం! - కేరళ హైకోర్టు అనూహ్య తీర్పు.. 100 మొక్కలు నాటాలని ఆదేశం
ఓ ఆదాయపు పన్ను కేసులో ఐఏఎస్ అధికారిని 100 మొక్కలు నాటాలని ఆదేశించింది కేరళ హైకోర్టు. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో జాప్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
కోర్టు అనూహ్య తీర్పు.. 100 మొక్కలు నాటాలని జరిమానా!
అయితే ఆయన ఏఏ ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్న విషయాన్ని అటవీ అధికారులకు అప్పగించింది. అనంతరం మొక్కలు నాటిన జాబితాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి:రామాయణం థీమ్‌తో కొత్త రైలు.. మార్చి 10న ప్రారంభం!
Last Updated : Mar 1, 2020, 9:16 AM IST