తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు చిదంబరం బెయిల్​ పిటిషన్​పై తీర్పు! - high court order today in inx media case

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీమంత్రి పి. చిదంబరం దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​పై నిర్ణయాన్ని నేడు వెలువరించనుంది దిల్లీ హైకోర్టు. తాను సాక్షులను ప్రభావితం చేసే స్థితిలో లేనని బెయిల్​ మంజూరు చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు చిదంబరం. అయితే సాక్షులను ప్రభావితం చేసేందుకు అవకాశం ఉన్న కారణంగా బెయిల్​ ఇవ్వకూడదంటూ వాదనలు కోరుతోంది ఈడీ.

నేడు చిదంబరం బెయిల్​ పిటిషన్​పై తీర్పు!

By

Published : Nov 15, 2019, 6:36 AM IST

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బెయిల్ పిటిషన్​పై నేడు తీర్పును వెలువరించనుంది దిల్లీ హైకోర్టు. ఐఎన్​ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆయన బెయిల్​ మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్​ పిటిషన్​పై నవంబర్ 8న విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ ఖైత్ తీర్పును రిజర్వులో ఉంచారు.

కేసులో ఆధారాలు పత్రాల రూపంలో ఉన్నాయని.. వాటిని తాను ప్రభావితం చేయలేనని పేర్కొంటూ బెయిల్​ మంజూరు చేయాలని చిదంబరం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే చిదంబరం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. బెయిల్​ మంజూరును వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్.

కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈడీ తరఫున వాదనలు వినిపించగా.. చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు చిదంబరం ఎప్పుడూ ప్రయత్నించలేదని పేర్కొన్నారు. అయితే అకస్మాత్తుగా అక్టోబర్​లో ఆయన సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు రావడం అవాంఛనీయమన్నారు.

చిదంబరానికి బెయిల్ మంజూరు చేయకూడదన్న ఈడీ వాదనను వ్యతిరేకించారు సిబల్. కేసులో పురోగతి దిశగా ఈడీ వ్యవహరించడం లేదని కేవలం చిదంబరాన్ని జైల్లో ఉంచి.. ఆయన ఆరోగ్యం పాడు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుందని ఆరోపించారు.

ఇదీ చూడండి: 13 మంది 'అనర్హత' ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details