తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగిసిన రాజస్థాన్​ మంత్రివర్గ సమావేశం - rebel Congress MLAs

A bench of Chief Justice Indrajit Mahanty and Justice Prakash Gupta is likely to pronounce order on petition filed by Sachin Pilot and 18 other rebel Congress MLAs. The dissident MLAs had moved the court on Friday amid the infighting in the state unit of the Congress

Rajasthan politics
రాజస్థాన్ పాలిటిక్స్‌: కొనసాగుతున్న ఉత్కంఠ!

By

Published : Jul 21, 2020, 2:31 PM IST

Updated : Jul 21, 2020, 7:45 PM IST

19:42 July 21

ముగిసిన రాజస్థాన్​ మంత్రివర్గ సమావేశం

సీఎం గహ్లోత్‌ అధ్యక్షతన సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరిగింది. సీఎం గహ్లోత్ నివాసంలో జరిగిన ఈ  భేటీలో పలు అంశాలపై చర్చించారు. కరోనా, టూరిజం, మిడతల సమస్యలపై చర్చించినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు.

15:50 July 21

మంత్రివర్గ సమావేశం

సీఎం గహ్లోత్‌ అధ్యక్షతన సాయంత్రం మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం గహ్లోత్ నివాసంలో ఈ  భేటీ జరగనుంది.

15:29 July 21

మూడు రోజుల ఊరట

రాజస్థాన్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మూడు రోజుల ఊరట లభించింది.ఈనెల 24 వరకూ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు స్పీకర్‌కు సూచించింది. రాజస్థాన్‌ స్పీకర్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 24న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు వెల్లడించింది. విప్‌ ధిక్కరించి శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరైన పైలెట్ సహా 19మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు.  

అయితే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మాత్రమే విప్‌ వర్తిస్తుందని, స్పీకర్‌ జారీచేసిన నోటీసులు కొట్టివేయాలని పైలట్ వర్గం హైకోర్టుకు వెళ్లింది. ఈ అంశంపై హైకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. శాసన వ్యవస్థలో స్పీకరే సుప్రీం అని ఆయన ఇచ్చిన నోటీసుల్లో కోర్టు జోక్యం తగదని స్పీకర్‌ తరపు న్యాయవాది వాదించారు. నోటీసులు జారీ చేయడానికి తగిన కారణాల్లేవని, సమాధానం ఇచ్చేందుకు కూడా తగిన సమయం ఇవ్వలేదని పైలెట్ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనల అనంతరం లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు ఈనెల 24న తీర్పు వెలువరిస్తామని స్పష్టంచేసింది. అప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పీకర్‌ను కోరింది.

15:23 July 21

పైలట్ వర్గానికి హైకోర్టులో ఊరట.. 24న తీర్పు

  • రాజస్థాన్‌ హైకోర్టులో సచిన్ పైలట్ వర్గానికి ఊరట
  • ఈనెల 24 వరకు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు
  • సచిన్ పైలట్ పిటిషన్‌పై ఈనెల 24న తీర్పు వెలువరించనున్న హైకోర్టు
  • విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని స్పీకర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
  • పైలట్‌ సహా 19మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు
  • సచిన్ పైలట్ సహా 19 మందికి నోటీసులు జారీచేసిన స్పీకర్
  • శాసనసభ జరుగుతున్నప్పుడే విప్‌ వర్తిస్తుందని హైకోర్టుకు వెళ్లిన సచిన్ పైలట్
  • స్పీకర్‌ జారీచేసిన నోటీసులు కొట్టివేయాలని హైకోర్టును కోరిన సచిన్ పైలట్ వర్గం
  • రాజస్థాన్ హైకోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు

14:06 July 21

రాజస్థాన్ పాలిటిక్స్‌: కొనసాగుతున్న ఉత్కంఠ!

రాజస్థాన్‌ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్‌ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ రెబల్‌ నేత సచిన్‌ పైలట్‌కు ఇచ్చిన గ‌డువు ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ సమయంలోనే సచిన్‌ వేసిన పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టులో నేడు మరోసారి విచారణ కొనసాగుతోంది. ఈరోజు విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి ఇప్పటికే ప్రకటించారు.  ఇరువర్గాలు 2 గంటలలో తమ రాతపూర్వక స్పందనలు తెలియజేయాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

సీఎల్పీ భేటీ..

ఇదే సమయంలో, ఇరువర్గాల క్యాంపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మద్దతుదారులు దాదాపు 100మంది ఎమ్మెల్యేలు గడిచిన వారం రోజులుగా జైపుర్‌లోని ఫెయిర్‌మోంట్‌ హోటల్‌లోనే మకాం వేశారు. తాజాగా అక్కడే ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభ పక్ష సమావేశం(సీఎల్పీ) జరుగుతోంది. ఈవారం రోజుల్లో సీఎల్పీ సమావేశం కావడం ఇది మూడోసారి.  

మరింత దూరం..

సీఎల్పీ సమావేశానికి రెబల్‌ నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు నిన్నటివరకూ ఉంచనా వేశారు. కానీ, తాజాగా రెబల్‌ నేత సచిన్‌ పైలట్‌ ఒక దద్దమ్మ అంటూ ముఖ్యమంత్రి గహ్లోత్‌  చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి సచిన్‌ మరింత దూరమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సచిన్‌ వర్గం కూడా హైకోర్టు తీర్పుపైనే ఆశలు పెట్టుకుంది.

Last Updated : Jul 21, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details