రక్షణ కల్పించాలంటూ పంజాబ్- హరియాణా ఆశ్రయించిన నవ దంపతులకు హైకోర్టును రూ.10 వేల జరిమానా విధించిన విచిత్ర సంఘటన చండీగఢ్‌లో జరిగింది. అనంతరం వారికి రక్షణ కల్పించాలంటూ స్థానిక పోలీసులను ఆదేశించింది హైకోర్టు.
ఇదీ జరిగింది...

గురుదాస్‌పుర్‌కు చెందిన యువతి, యువకులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో భయపడిన ఆ నవ దంపతులు.. తమకు రక్షణ కల్పించాలంటూ మే 23న గురుదాస్‌పుర్ ఎస్పీని ఆశ్రయించారు. అనంతరం హైకోర్టులోనూ తమ వివాహ వేడుకకు సంబంధించిన చిత్రాలతో పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణలో భాగంగా చిత్రాలను పరిశీలించిన హైకోర్టు పెళ్లి సమయంలో వేడుకకు హాజరైన ప్రజలు, దంపతులు మాస్క్‌లు ధరించలేదని గుర్తించి.. వారికి రూ. 10 వేల జరిమానా విధించింది. అనంతరం దంపతులకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.