నిర్భయ కేసులో కింది కోర్టు విధించిన మరణశిక్షను నిలిపివేయాలని కోరుతూ నిందితుడు ముఖేశ్‌కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది దిల్లీ హైకోర్టు. సెషన్స్ కోర్టులో తీర్పు అమలును సవాలు చేసేందుకు అనుమతించింది. జనవరి 7న ట్రయల్ కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పులో తప్పుపట్టాల్సిందేమి లేదని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీత దింగ్ర సెహ్గల్ ధర్మాసనం అభిప్రాయపడింది.
2012 నాటి నిర్భయ ఘటనలో కింది కోర్టు విధించిన మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు నిందితుడు. అయితే ముఖేశ్‌కుమార్ సింగ్ వ్యాజ్యాన్ని సుప్రీం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు ముఖేశ్. అనంతరం రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు తీర్పు అమలును నిలిపివేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని అవకాశం కల్పించింది.
దిల్లీ ప్రభుత్వ వివరణ