తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్యుల డిమాండ్లకు మమత అంగీకారం - junior doctors

బంగాల్​లో ఐదు రోజులుగా జరుగుతున్న వైద్యుల ఆందోళనలతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగొచ్చారు. వారి డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతోందని ప్రకటించారు. వెంటనే విధుల్లో చేరాలని విన్నవించారు.

వైద్యుల ఆందోళనలతో దిగొచ్చిన మమత

By

Published : Jun 15, 2019, 7:51 PM IST

వైద్యుల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గత ఐదు రోజులుగా నిరసనలు చేపడుతున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని ఆమె కోరారు.

" వేలాదిమంది వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు. వైద్యుల డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినందున వెంటనే విధుల్లో చేరాలి. అత్యవసర సేవల చట్టం-ఎస్మా ప్రయోగించే ఉద్దేశం లేదు. వైద్యుల ప్రతినిధుల బృందాన్ని కలిసేందుకు మంత్రులు, అధికారులు నిన్న, ఇవాళ 5 గంటల పాటు వేచి చూశారు. కానీ వారు రాలేదు. రాజ్యాంగ సంస్థలకు గౌరవం ఇవ్వాలి. చర్చలకు రావాలి. ఈనెల 10న జరిగిన ఘటన దురదృష్టకరం. సమస్య పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

వైద్యుల రక్షణకు అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు మమత. దాడిలో గాయపడిన జూనియర్​ డాక్టర్​ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

గవర్నర్​ చొరవ...

వైద్యుల భద్రత కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని మమతకు బంగాల్​ గవర్నర్​ కేసరినాథ్​ త్రిపాఠి సూచించారు. వివాదానికి పరిష్కారం కనుగొనాలని సూచిస్తూ లేఖ రాశారు.

గవర్నర్​తో తాను స్వయంగా మాట్లాడి, ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు మమత వెల్లడించారు.

ఇదీ చూడండి:'వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురండి'

ABOUT THE AUTHOR

...view details