కరోనాతో కలిసి జీవించాల్సి వస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ మహమ్మారి నేర్పిన పాఠాలకు అనుగుణంగా కొత్త జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కరోనాను కట్టడి చేసే క్రమంలో లాక్డౌన్ను మే 31వరకు కేంద్రం పొడిగించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.
"కరోనాకు ముందు ఆనందం, సంపద కోసం ఒంటరిగా జీవించేవాళ్లం. కాలం మారుతున్న కొద్దీ కుటుంబ, సామాజిక అనుబంధాలు తగ్గాయి. ఒంటరిగా జీవించాలనే అర్థంలేని భావన పుట్టుకొచ్చింది. కానీ కరోనా వీటన్నింటినీ మార్చింది" అని ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు వెంకయ్య.
"జీవితంలో ఒంటరిగా ఉండలేం. మనుషుల మధ్య పరస్పర అనుబంధాన్ని ఈ మహమ్మారి గుర్తుచేసింది.