ఈరోజు నిర్వహించే మనసులో మాట (మన్ కీ బాత్) కార్యక్రమంలో చర్చించేందుకు పలు కీలక అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ రోజు ఉదయం 11 గంటలకు జరగబోయే కార్యక్రమంలో చర్చించేందుకు భవిష్యత్తుకు దారి చూపే పలు ముఖ్యమైన విషయాలు అందాయని ట్వీట్ చేశారు.
'నేటి మన్ కీ బాత్లో చర్చించేందుకు కీలక అంశాలు' - మనసులో మాట
నేడు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారి విపత్తుపై పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
'నేటి మన్ కీ బాత్లో చర్చించేందుకు కీలక అంశాలు'
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ప్రతి నెల చివరి ఆదివారం రోజున మనసులో మాట కార్యక్రమం నిర్వహిస్తారు మోదీ. దేశంలోని తాజా అంశాలపై మాట్లాడుతారు.