హాథ్రస్ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పూర్తయింది. శుక్రవారం (అక్టోబరు 16న) ప్రభుత్వానికి సిట్ నివేదిక సమర్పించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి సిట్ తుది నివేదిక అక్టోబరు 7న సమర్పించాల్సి ఉండగా... దర్యాప్తు పూర్తి కాలేదు. దీంతో దర్యాప్తునకు మరో 10 రోజులు సమయమిచ్చింది యోగి సర్కార్. ఇప్పటికే సిట్ ప్రాథమిక నివేదిక సమర్పించగా.. వెంటనే ఎస్పీ, సీఐ సహా పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు యోగి.