తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2020, 5:03 PM IST

Updated : Oct 2, 2020, 7:28 PM IST

ETV Bharat / bharat

మీడియాతో మాట్లాడనివ్వకుండా 'హాథ్రస్'లో ఆంక్షలు!

హాథ్రస్​ ఘటనపై సిట్​ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో బాధితురాలి గ్రామాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామంలో కఠిన ఆంక్షలు నెలకొన్నాయని.. పోలీసుల కళ్లు కప్పి బయటికి వచ్చిన బాధితురాలి సోదరుడు తెలిపాడు. పోలీసులు తమ ఫోన్లను లాక్కొని, ఇంట్లో నిర్బంధించి తీవ్రంగా బెదిరిస్తున్నారని ఆరోపించాడు. మీడియాతోనూ మాట్లాడనీయకుండా ఆంక్షలు విధించారని మరో బంధువు తెలిపాడు.

hathras victims brother
బాధితురాలి సోదరుడు

హాథ్రస్​లో హత్యాచార బాధితురాలి గ్రామం బుల్​గద్ధిని పోలీసులు పూర్తిగా నిర్బంధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బాధితురాలి సోదరుడు గజేంద్ర వెల్లడించాడు. పోలీసుల కళ్లు కప్పి ఓ యువకుడి సాయంతో బయటికి వచ్చినట్లు తెలిపాడు.

గ్రామంలో పరిస్థితి భయానకంగా ఉందని గజేంద్ర వివరించాడు. ఊరిలోకి ఎవరూ రావటం, పోవటం చేయకుండా కఠిన ఆంక్షలు విధించారని తెలిపాడు. ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు బెదిరిస్తున్నారని, బయటికి వస్తే కొడుతున్నారన్నాడు.

నిర్బంధంలో బాధితురాలి కుటుంబం..

బాధితురాలి కుటుంబాన్ని గృహ నిర్బంధం చేసి పోలీసులు బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. వారి ఫోన్లను తీసుకుని స్విఛ్ ఆఫ్ చేశారని, ఇంటికి బయటి నుంచి తాళం వేసినట్లు బాధితురాలి సోదరుడు తెలిపాడు. గ్రామంలో సుమారు 660 మంది పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారని, ఎలాగైనా రాత్రి ఇంటికి చేరుకుంటానని చెప్పాడు.

బాధితురాలి సోదరుడు

మీడియాతోనూ మాట్లాడనివ్వటం లేదు..

బాధితురాలి మరో బంధువు కూడా ఇదే ఆరోపణలు చేశాడు. మీడియాతో మాట్లాడేందుకు అనుమతివ్వట్లేదని తెలిపాడు. ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారని స్పష్టం చేశాడు.

బాధితురాలి బంధువు

ఈ ఆరోపణలను హాథ్రాస్​ జిల్లా కలెక్టర్​ ఖండించారు. ఇవన్నీ వదంతులు మాత్రమేనని అన్నారు.

ప్రవేశం లేదు..

హత్యాచార ఘటనపై సిట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రామంలోకి ఎవరిని అనుమతించమని పోలీసులు శుక్రవారం ప్రకటన చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా రాజకీయ లేదా ఇతర వ్యక్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాథ్రస్​ అదనపు ఎస్​పీ ప్రకాశ్ కుమార్ తెలిపారు.

గ్రామ ప్రవేశ మార్గంలోనూ భారీగా పోలీసులను మోహరించారు. ఘటనపై సిట్​ దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చూడండి:'హాథ్రస్​ ఘటన కేసులో సీబీఐ దర్యాప్తునకు డిమాండ్'

Last Updated : Oct 2, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details