దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ప్రదేశ్ హత్రాస్ అత్యాచార ఘటన బాధితురాలి అంత్యక్రియలు బుధవారం వేకువ జామున జరిగాయి. అయితే తమ అనుమతి లేకుండా యూపీ పోలీసులు హుటాహుటిన కార్యక్రమం నిర్వహించారని బాధితురాలి సోదరుడు ఆరోపించారు. దిల్లీ సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో బాధితురాలు మరణించిన రోజే భౌతిక కాయాన్ని హత్రాస్ తరలించినట్లు పేర్కొన్నారు. అంత్యక్రియలను బంధువుల సమక్షంలో బుధవారం రోజు నిర్వహిస్తామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదన్నారు.
అయితే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమతితోనే కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. హత్రాస్ జిల్లా కలెక్టర్ సైతం అదే విషయాన్ని స్పష్టంచేశారు.
సిట్ ఏర్పాటు
సెప్టెంబరు 14న జరిగిన ఎస్సీ యువతి అత్యాచర ఘటనపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారం రోజుల్లోగా నివేదిక అందజేస్తారని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, న్యాయప్రక్రియ త్వరగా జరిగేలా చూస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
యోగికి మోదీ ఫోన్..
ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి హత్రాస్ అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారని యోగి తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మోదీ చెప్పారని ట్వీట్ చేశారు.
యోగి రాజీనామాకు డిమాండ్..