హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తును కొనసాగించాలని ధర్మాసనాన్ని కోరింది యూపీ ప్రభుత్వం. 15 రోజుల్లో స్థితి నివేదిక ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్లో అభ్యర్థించింది. బాధిత కుటుంబం, సాక్షుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.
'హాథ్రస్'పై గురువారం సుప్రీంలో విచారణ - hathras case new update
గురువారం హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనాన్ని కోరింది.
హాథ్రస్ ఘటన పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ
బాధిత కుటుంబానికి మూడంచెల భద్రత కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అర్ధరాత్రి దహన సంస్కారాలపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి : విచారణలో ఉన్న వ్యాజ్యాలపై మీడియా వ్యాఖ్యలా?
Last Updated : Oct 14, 2020, 1:44 PM IST