తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హాథ్రస్​ ఘటన సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కీలక తీర్పు

హాథ్రస్​ ఘటనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సీబీఐ దర్యాప్తును అలహాబాద్​ హైకోర్టు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది.

SC directs Allahabad HC to monitor Hathras probe
హాథ్రస్​ ఘటన సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కీలక తీర్పు

By

Published : Oct 27, 2020, 1:16 PM IST

Updated : Oct 27, 2020, 2:27 PM IST

హాథ్రస్​ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తును అలహాబాద్​ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యాక విచారణ దిల్లీకి బదిలీ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.

బాధిత కుటుంబం, సాక్షుల భద్రతనూ అలహాబాద్​ న్యాయస్థానమే పరిశీలిస్తుందని తెలిపింది.

ఉత్తర్​ప్రదేశ్​లో బాధితులకు సరైన న్యాయం జరగదని, విచారణను బదిలీ చేయాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని పరిశీలించిన సుప్రీం.. అలహాబాద్​ హైకోర్టు ముందు సీబీఐ స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ దళిత యువతిపై సెప్టెంబర్​ 14న నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని తీవ్రంగా హింసించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. తొలుత సిట్‌ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. అనంతరం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. దీంతో ఈ కేసు విచారణ సీబీఐ చేతికి చేరింది.

Last Updated : Oct 27, 2020, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details