తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దంగల్​ 2019: 'హంగ్​' దిశగా హరియాణా!

90 స్థానాలున్న హరియాణాలో ఫలితాలు హంగ్​ దిశగా సాగుతున్నాయి. అధికార భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు పొందే అవకాశాలు కనిపించటం లేదు. కాంగ్రెస్​ కూడా అదే పరిస్థితిలో ఉంది. తుది ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

దంగల్​ 2019: 'హంగ్​' దిశగా హరియాణా!

By

Published : Oct 24, 2019, 11:13 AM IST

హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం హంగ్​ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధికార భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 46 సీట్లు సాధించే అవకాశాలు కనిపించటం లేదు. కాంగ్రెస్​దీ అదే పరిస్థితి.

అధికారం ఎవరిది..?

హంగ్​ ఏర్పడితే అధికారం ఎవరిదనేది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చెప్పుకోదగ్గ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న జేజేపీ... తమకు ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తారో వారికే మద్దతు ఇస్తామని ప్రకటించింది.

కాంగ్రెస్​ పార్టీ జేజేపీతో జట్టు కట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని స్థానాలు వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ జేజేపీతో పాటు స్వతంత్రులూ కింగ్​ మేకర్లుగా నిలిచే అవకాశం ఉంది.

భాజపాతో జేజేపీ జట్టు కడితే ఎలాంటి రాజకీయ ఉత్కంఠ ఉండదు.. కానీ అలా జరగని తరుణంలో అధికార పీఠాన్ని ఎవరు చేజిక్కించుకుంటారన్నది ఆసక్తికరం.

ఇదీ చూడండి: 'మహా'పోరు: ఆధిక్యంలో కమలదళం.. కానీ..

ABOUT THE AUTHOR

...view details