తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: భారత్​ నేలపై రఫేల్- మోదీ స్వాగతం

Haryana: First batch of five Rafale aircraft will arrive in Ambala today to join the India Air Force (IAF) fleet
భారత్​ గగనతలంలోకి రఫేల్ యుద్ధవిమానాలు

By

Published : Jul 29, 2020, 9:08 AM IST

Updated : Jul 29, 2020, 4:53 PM IST

16:51 July 29

గగనతలంలో మరింత రక్షణ..

వేగం, ఆయుధ సామర్థ్యంలో రఫేల్ ఎంతో ముందుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇది ఓ గేమ్​ ఛేంజర్​ అని షా అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భారత వైమానిక దళానికి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.  

"భారత్​ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ ఆలోచనలకు రఫేల్ రాక నిదర్శనం. దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. భారత వైమానిక దళానికి అపారమైన బలాన్ని చేకూర్చిన మోదీకి కృతజ్ఞతలు. ఆకాశంలో భారత వీరులకు రఫేల్​ మరింత రక్షణ ఇస్తుంది."

- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి 

16:30 July 29

రఫేల్​కు మోదీ స్వాగతం ..

భారత్​ భూభాగాన్ని ముద్దాడిన రఫేల్​కు ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలికారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. "దేశ రక్షణ ఒక పుణ్యం, ఒక వ్రతం, ఒక యజ్ఞం" అని పేర్కొన్నారు.  

15:34 July 29

అంబాలాలో రఫేల్​ ల్యాండింగ్ ఇలా..

ఫ్రాన్స్​ నుంచి బయలుదేరిన రఫేల్ విమానాలు బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో దిగాయి. ఈ దృశ్యాలు మీకోసం..

15:26 July 29

సైన్యం చరిత్రలో నవశకం..

భారత నేలను ముద్దాడిన రఫేల్ విమానాలు దేశ సైనిక చరిత్రలో నవ శకాన్ని ప్రారంభించాయని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు.  

"అంబాలాలో ఈ పక్షులు సురక్షితంగా దిగాయి. ఇది భారత సైన్య చరిత్రలో నవశకం ప్రారంభానికి చిహ్నం. ఈ బహుళ వినియోగ యుద్ధవిమానాలతో భారత వైమానిక దళ సామర్థ్యం పెరుగుతుంది."

- రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి  

15:12 July 29

అంబాలా వైమానిక స్థావరంలో రఫేల్​..

భారత్​ ఎంతగానో ఎదురుచూస్తోన్న రఫేల్ యుద్ధవిమానాలు అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. తొలుత భారత్​ గగనతలంలోకి ప్రవేశించిన రఫేల్​ విమానాలకు రెండు సుఖోయ్​- 30 ఎంకేఐ విమానాలతో స్వాగతం పలికింది రక్షణ శాఖ. వాటి వెన్నంటే ఉండి అంబాలాకు చేరుకున్నాయి రఫేల్ సూపర్​జెట్లు.

భారత వైమానిక దళ అమ్ముల పొదిలోకి చేరేందుకు రఫేల్​ విమానాలు సోమవారమే ప్రయాణం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరం మెరినాక్‌ వైమానికి స్థావరం నుంచి బయలుదేరిన ఐదు జెట్‌లు పది గంటల ప్రయాణం అనంతరం సోమవారం సాయంత్రానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లోని ఆల్‌ ధాఫ్రా వైమానికి స్థావరంలో దిగి అక్కడి నుంచి అంబాలాకు వచ్చాయి.

మొత్తం ఏడు వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణంలో రఫేల్‌ జెట్‌లు గాలిలోనే ఇంధనాన్ని నింపుకోగా.. అందుకోసం ఫ్రాన్స్‌ వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ఇంధన ట్యాంకర్‌ విమానాన్ని ఏర్పాటు చేసింది.

14:59 July 29

ఆటంకం లేకుండా...

రఫేల్​ ల్యాండింగ్​ కోసం అంబాలా వైమానిక ప్రాంతాన్ని ఉదయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి వైమానిక దళ హెలికాప్టర్లు. ఈ మేరకు పక్షుల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది వైమానిక దళం. పక్షులను తరిమికొట్టడానికి ఫైర్ బాణసంచా కాల్చారు వైమానికాధికారులు.

14:41 July 29

రఫేల్​ "టచ్​డౌన్​"

యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న రఫేల్​ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్​బేస్​లో ల్యాండ్​ అయ్యాయి. మొత్తం ఐదు విమానాలకు వాటర్​ సెల్యూట్​తో ఘన స్వాగతం లభించింది.  

2016లో భారత్​-ఫ్రాన్స్​ మధ్య మొదలైన ఒప్పంద సమయం నుంచి నిత్యం వార్తల్లో నిలిచిన రఫేల్​.. భారత వాయుసేనకు ఓ గేమ్​ ఛేంజర్​ అని వాయుసేన భావిస్తోంది. సోమవారం ఫ్రాన్స్​ నుంచి బయలుదేరిన రఫేల్​ విమానాలు.. అదే రోజు సాయంత్రానికి యూఏఈలోని ఆల్​ ధాఫ్రా వైమానిక స్థావరంలో దిగాయి. అనంతరం ఈరోజు మధ్యాహ్నం అంబాలాకు చేరుకున్నాయి. 

14:25 July 29

అదిగో 'రఫేల్​'...

భారత గగనతలంలోకి ప్రవేశించిన ఐదు రఫేల్​ యద్ధవిమానాలకు రెండు సుఖోయ్​-30ఎమ్​కేఐ జెట్లు స్వాగతం పలికాలి. వాటి వెన్నంటే ఉండి అంబాలావైపు పయనిస్తున్నాయి.

14:24 July 29

ఐఎన్​ఎస్​ కోల్​కతాతో

వాయుసేన ఎంతగానో ఎదురుచూస్తున్న రఫేల్​ యుద్ధవిమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. మరికొద్ది సేపట్లో అంబాలా ఎయిర్​బేస్​లో దిగనున్నాయి.  

అయితే యూఏఈలో బయలుదేరిన కొద్ది సేపటికే.. పశ్చిమ అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్​ఎస్​ కోల్​కతాతో కాంటాక్ట్​ ఏర్పరచుకుంది.

14:23 July 29

ఐఎన్​ఎస్​ కోల్​కతాతో...

వాయుసేన ఎంతగానో ఎదురుచూస్తున్న రఫేల్​ యుద్ధవిమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. మరికొద్ది సేపట్లో అంబాలా ఎయిర్​బేస్​లో దిగనున్నాయి.  

అయితే యూఏఈలో బయలుదేరిన కొద్ది సేపటికే.. పశ్చిమ అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్​ఎస్​ కోల్​కతాతో కాంటాక్ట్​ ఏర్పరచుకుంది.

13:42 July 29

భారత్​ గగనతలంలోకి రఫేల్ యుద్ధవిమానాలు

ఈ రోజు మధ్యాహ్నం సుమారు 2 గంటలకు హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి  మొదటి బ్యాచ్​ రఫేల్ యుద్ధవిమానాలు వస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే అరేబియా సముద్రంలోని ఐఎన్​ఎస్​ కోల్​కతా యుద్ధనౌకతో రఫేల్ బృందం కాంటాక్ట్​లోకి వచ్చిందని పేర్కొన్నారు.

11:33 July 29

వాటర్​ సెల్యూట్​

రఫేల్​ యుద్ధ విమానాల కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అంబాలా ఎయిర్​బేస్​కు చేరుకున్న వెంటనే.. యుద్ధ విమానాలకు వాటర్​ సెల్యూట్​ ఇవ్వనున్నట్టు వాయుసేన చీఫ్​ భదౌరియా వెల్లడించారు. 

10:42 July 29

అత్యాధునిక రఫేల్‌ యుద్ధవిమానాలు మరికొన్ని గంటల్లో భారత్​లో అడుగుపెట్టనున్నాయి. రఫేల్​ రాక కోసం భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విమానాలు అంబాలాకు రానున్న నేపథ్యంలో హై అలర్ట్​ ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. అంబాలా ఎయిర్​బేస్​ పరిసర ప్రాంతాలలో మంగళవారం నుంచే 144 సెక్షన్​ విధించింది.

ప్రయాణం ఇలా...

భారత వైమానిక దళ అమ్ముల పొదిలోకి చేరేందుకు రఫేల్​ విమానాలు సోమవారమే ప్రయాణం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరం మెరినాక్‌ వైమానికి స్థావరం నుంచి బయలుదేరిన ఐదు జెట్‌లు పది గంటల ప్రయాణం అనంతరం సోమవారం సాయంత్రానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లోని ఆల్‌ ధాఫ్రా వైమానికి స్థావరంలో దిగాయి. అక్కడి నుంచి హరియాణాలోని అంబాలాకు ఈ రోజు మధ్యాహ్నం చేరుకోనున్నాయి. మొత్తం ఏడు వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణంలో రఫేల్‌ జెట్‌లు గాలిలోనే ఇంధనాన్ని నింపుకోనుండగా.. అందుకోసం ఫ్రాన్స్‌ వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ఇంధన ట్యాంకర్‌ విమానాన్ని ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి:-గేమ్​ ఛేంజర్​ 'రఫేల్'​ ఎందుకింత ప్రత్యేకం?

08:38 July 29

రఫేల్​ కోసం అంబాలా సిద్ధం

భారత రక్షణ రంగాన్ని శత్రు దుర్భేద్యం చేసే రఫేల్ యుద్ధవిమానాలు ఇవాళ మధ్యాహ్నం అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి.  ఫ్రాన్స్​లోని అల్​-దాఫ్రా వైమానిక స్థావరం నుంచి ఇప్పటికే ఈ యుద్ధ విమానాలు భారత్​కు పయనమయ్యాయి.

రఫేల్ యుద్ధ విమానాలు అంబాలాకు రానున్న నేపథ్యంలో హై అలర్ట్​ ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. అంబాలా ఎయిర్​బేస్​ పరిసర ప్రాంతాలలో మంగళవారం నుంచే 144 సెక్షన్​ విధించింది. ఫొటోలు, వీడియోలకు అనుమతి నిరాకరించిన జిల్లా అధికారులు.. ఆ ప్రాంతంలో కనీసం మూడు కిలోమీటర్ల వరకూ డ్రోన్​లను కూడా నిషేధించింది.

భారత్​ తన కీలక రక్షణ భాగస్వామి ఫ్రాన్స్​తో 36 రఫేల్ యుద్ధవిమానాలు కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మొదటి ఐదు రఫేల్ యుద్ధవిమానాలు నేడు భారత్​కు చేరనున్నాయి. అంబాలాలో మొదటి స్క్వాడ్రన్ విమానాలు మోహరిస్తారు. హసిమారా వైమానిక స్థావరంలో రెండో స్క్వాడ్రన్ విమానాలు మోహరిస్తారు.

చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్​ తన దూకుడును పెంచింది. దేశ భద్రత దృష్ట్యా రక్షణ రంగ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 

Last Updated : Jul 29, 2020, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details