తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దశాబ్దం తర్వాత 'హరియాణా' చరిత్ర పునరావృతం

హరియాణా తాజా ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిణామాలు సరిగ్గా పదేళ్ల క్రితం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. 2009లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. అప్పుడు 40 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు భాజపా సరిగ్గా 40 సీట్లే నెగ్గి జేజేపీ మద్దతుతో అధికారంలోకి రానుంది.

హరియాణా ఫలితాలు: దశాబ్దం తర్వత చరిత్ర పునరావృతం

By

Published : Oct 26, 2019, 7:51 AM IST

Updated : Oct 26, 2019, 10:30 AM IST

90 స్థానాలున్న హరియాణా శాసనసభలో భాజపా 40 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం జేజేపీ గెలుచుకున్న 10మంది, స్వతంత్ర ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. పూర్తి మెజారిటీ లేకపోవడం వల్ల జేజేపీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది కాషాయ దళం. సరిగ్గా ఇవే ఫలితాలు దశాబ్దం కిందటా నమోదయ్యాయి. ఇప్పుడు భాజపా ఉన్న స్థానంలో.. 2009లో కాంగ్రెస్ ఉంది.

అధికార పార్టీకి ఆరు సీట్లు తక్కువ...

2009లో కాంగ్రెస్ 40 సీట్లు సాధించి మెజారిటీకి ఆరు సీట్లు వెనకబడింది. ప్రతిపక్షంలో ఉన్న నేషనల్ లోక్​దళ్ 31చోట్ల విజయం సాధించింది. స్వతంత్రులు 7 స్థానాల్లో గెలిచారు.

నేడు చౌతాలా.. నాడు కండా

2009లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన గోపాల్ కండా నాడు అధికార కాంగ్రెస్​కు మద్దతు ఇచ్చారు. తాజా ఫలితాల అనంతరమూ గోపాల్ కండా కీలకంగానే నిలిచారు. ఈ సారి హరియాణా లోక్​హిత్ పార్టీ శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 2009లో గెలిచిన సిర్సా నుంచే ఆయన జెండా ఎగరేశారు. అప్పుడు భూపీందర్ సింగ్ హుడా ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో 2012లో పదవికి రాజీనామా చేశారు.

ఈసారి గోపాల్ కండా భాజపాకు మద్దతిస్తున్నారు. నూతన ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి లభించే అంశమై ఇంకా స్పష్టత రాలేదు.

ఇప్పుడు జేజేపీ...అప్పుడు జన​హిత్ కాంగ్రెస్...

జేజేపీ భాజపాకు మద్దతిచ్చింది. ఇదే రీతిలోనే 2009లో హరియాణా జన​హిత్ కాంగ్రెస్​కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్​కు మద్దతిచ్చారు.

ఇదీ చూడండి: హరియాణాలో కమలమే..మహారాష్ట్రలో ఉత్కంఠ!

Last Updated : Oct 26, 2019, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details