హరియాణా శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈనెల 21న మొత్తం 90 స్థానాలకు పోలింగ్ జరిగింది. 11వందల 69 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. కోటి 83 లక్షల మంది ఓటర్లు ఉన్న హరియాణాలో 68 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపును 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. వీటికి అదనంగా గురుగ్రామ్‌లోని బాద్షాపూర్ సెగ్మెంట్లో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు.
హరియాణాలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - haryana elections news
మహారాష్ట్రతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగిన హరియాణా ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మొత్తం 90 స్థానాలు ఉండగా 11వందల 69 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం.
హరియాణాలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
హరియాణాలో అధికారంలో ఉన్న భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఈసారి ప్రధాన పోటీ ఉండగా.. రెండు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి కాషాయం పార్టీదే అధికారం అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చాయి. అవి నిజం అవుతాయా, లేక అయిదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ తిరిగి పగ్గాలు చేపడుతుందా అనే ఉత్కంఠపై మధ్యాహ్నాం వరకు స్పష్ట త రానుంది.