వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతుల నుంచి హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. నార్నోల్లో చేపట్టిన 'జల్ అధికార్ ర్యాలీ'లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. నల్లజెండాలను ప్రదర్శిస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు ఆందోళనకారులు. ఇంతలో భాజపా కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.
సీఎంకు నిరసన సెగ- నల్ల జెండాలతో ఆందోళనలు - Farmers shown black flag in Haryana
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. 'జల్ అధికార్ ర్యాలీ'ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా కొందరు నల్లజెండాలు ప్రదర్శించారు.
ఆ రాష్ట్ర సీఎంకు నిరసన సెగ- నల్ల జెండాలతో ఆందోళనలు
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 26నుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసనకు దిగారు కర్షకులు.
ఇదీ చదవండి:'దాడులకు భయపడం- మా గెలుపు తథ్యం'