కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలు.. లోక్సభలో గందరగోళానికి దారితీశాయి. సుమారు గంటపాటు ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి హర్షవర్ధన్... ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రధానిని యువత కర్రలతో కొడతారన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హర్షవర్ధన్ వ్యాఖ్యలతో వెల్లోకి దూసుకొచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ గందరగోళం నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్.