తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ డిజిటల్ ఆరోగ్య ముసాయిదా విడుదల - ఆరోగ్య శాఖమంత్రి

వైద్య సదుపాయాలను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. జాతీయ డిజిటల్ ఆరోగ్య ముసాయిదాను కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్ష వర్ధన్ దిల్లీలో విడుదల చేశారు. దీనిపై మూడు వారాల్లోగా సూచనలు ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

జాతీయ డిజిటల్ ఆరోగ్య ముసాయిదా విడుదల

By

Published : Jul 16, 2019, 6:57 AM IST

అందరికీ మెరుగైన వైద్య సదుపాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్ధన్ ఉద్ఘాటించారు. డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ లక్ష్యంగా 'జాతీయ డిజిటల్ ఆరోగ్య ముసాయిదా'ను విడుదల చేశారు. దీని ద్వారా మెరుగైన ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలు అందించేందుకు సంకల్పించారు. ఈ డిజిటల్ వ్యవస్థలో వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ డిజిటల్ ఆరోగ్య ప్రణాళికపై వివిధ రంగాల వ్యక్తులు, సంస్థల నుంచి సూచనలను ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు కేంద్రమంత్రి. సూచనలను డబ్ల్యూ. డబ్ల్యూ. డబ్ల్యూ. ఎంఓహెచ్​ఎఫ్​డబ్ల్యూ. జీఓవీ. ఇన్​ ద్వారా మూడు వారాల్లోగా పంపించాలని సూచించారు. అందరికీ ఆరోగ్యం అందించటంలో అవసరమయ్యే ప్రతి అంశం భారత్​లో ఉందని ఉద్ఘాటించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్న ఈ జాతీయ డిజిటల్ ఆరోగ్య ప్రణాళిక ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్య సదుపాయం అందాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. డిజిటల్ ఇండియా పథకం కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇదీ చూడండి: కేరళ రెస్టారెంట్​లో వడ్డించే రోబో భామలు!

ABOUT THE AUTHOR

...view details