కశ్మీర్లోని శ్రీనగర్లో నిరసనలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నేషనల్ కాన్పరెన్స్ పార్టీ ఖండించింది. ఇటువంటి కఠిన చర్యలు ప్రభుత్వం నుంచి ప్రజలను మరింత దూరం చేస్తాయని తెలిపింది. లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వ చర్యలు విఘాతం కలిగిస్తాయని స్పష్టం చేసింది.
నిర్భంధంలో ఉన్న నాయకులను, సామాన్య ప్రజలను, ఫరూక్ అబ్దుల్లా బంధువులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నాయకులు. ఈ చర్యల వలన కశ్మీరీల్లో భయం, అభద్రతా భావం మరింత పెరుగుతాయన్నారు. కశ్మీర్లో స్వేచ్ఛకు పెను ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.