తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణా​: రాజకీయ కురుక్షేత్రాన ప్రశాంతంగా పోలింగ్​

రాజకీయ కురుక్షేత్రం హరియాణాలో శాసనసభ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు, రాజకీయ ప్రముఖులు పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చారు. 90 స్థానాల్లో పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. అక్టోబర్​ 24న ఫలితాలు వెల్లడించనున్నారు. మరోసారి అధికారంలోకి వస్తామని భాజపా, కాంగ్రెస్​ ధీమాగా ఉన్నాయి.

హరియాణా​: అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం

By

Published : Oct 21, 2019, 6:01 PM IST

Updated : Oct 21, 2019, 7:01 PM IST

​హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ప్రజలు పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చారు. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో 65 శాతం పోలింగ్​ నమోదైంది.

90 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. 1,169 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​... సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

ఖట్టర్​ సైకిల్​ యాత్ర...

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​... సైకిల్​పై​ వచ్చి ఓటేశారు. చండీగఢ్​ నుంచి జన్​ శతాబ్ది ఎక్స్​ప్రెస్​ ద్వారా కర్నాల్​ చేరుకున్న ఆయన అక్కడినుంచి పోలింగ్​ కేంద్రానికి సైకిల్ యాత్ర చేశారు.

హరియాణా అసెంబ్లీ బరిలో నిలిచిన ముగ్గురు భాజపా అభ్యర్థులు, క్రీడా ప్రముఖులు సందీప్​ సింగ్​, యోగేశ్వర్​ దత్​, బబితా ఫొగాట్​ తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్​ సీనియర్​ నేత భూపిందర్​ సింగ్​ హుడా... రోహ్​తక్​లోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటేశారు. జేజేపీ నేత దుశ్యంత్​ చౌతాలా... సిర్సా పోలింగ్​ కేంద్రానికి ట్రాక్టర్​పై కుటుంబంతో సహా చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదంపూర్​లో భాజపా అభ్యర్థి, టిక్​ టాక్​ స్టార్​ సోనాలీ ఫొగాట్ ఓటు వేశారు. ​

భారీ భద్రత...

కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్​ ప్రశాంతంగా జరిగింది. అక్టోబర్​ 24న కౌంటింగ్​ జరిపి.. ఫలితాలు ప్రకటించనున్నారు.

నువ్వా-నేనా...

90 శాసనసభ స్థానాలున్న హరియాణాలో భాజపా, కాంగ్రెస్​తో పాటు ఐఎన్​ఎల్​డీ, జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ), హరియాణా జన్‌హిత్‌ కాంగ్రెస్‌ (హెచ్​జేసీ), ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, స్వరాజ్ ఇండియా తదితర చిన్నపార్టీలు అభ్యర్థుల్ని బరిలోకి దింపాయి.

ప్రధాన పోటీ మాత్రం భాజపా, కాంగ్రెస్, జేజేపీ​ మధ్యనే. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాషాయ పార్టీ, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్​ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Last Updated : Oct 21, 2019, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details