రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. ఆయన పేరును భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపాదించగా.. థావర్ చంద్ సమర్థించారు. మూజువాణి పద్ధతిలో ఈ ఎన్నిక జరిగింది. విపక్షాల తరఫున ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా పోటీ చేశారు.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ మరోసారి ఎన్నిక - హరివంశ్ నారాయణ్ సింగ్
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా జేడీయూ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ రెండోసారి ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం హరివంశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర సభ్యులు.
తొలుత 2018లో కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్‌ను ఓడించి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో పదవీకాలం ముగియడంతో మరోసారి పోటీలో నిలిచారు. హరివంశ్ తిరిగి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం పట్ల మొదటి నుంచీ భాజపా ధీమాగా ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీయేకు 113 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ విపక్షాల మద్దతు కూడగట్టంలో ఆ పార్టీ సఫలమైంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్డీయే అభ్యర్థికి వైకాపా, తెదేపా మద్దతు ఇవ్వగా.. తెరాస ఓటింగ్‌కు దూరంగా నిలిచింది.