తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మీరు చౌకీదార్​ - మేము బేరోజ్​గార్​" - హార్ధిక్​ పటేల్

ప్రధాని మోదీ చేపట్టిన 'మై బీ చౌకీదార్'​ ప్రచారానికి పాటీదార్​​ ఉద్యమ నేత, కాంగ్రెస్​ నాయకుడు హార్దిక్​​ పటేల్​ చురకలంటించారు. ట్విటర్​లో తన  ఖాతాకు బేరోజ్​గార్​(నిరుద్యోగి) పదాన్ని పేరుకు ముందు చేర్చి నిరసన తెలిపారు. మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆరోపించారు.

గుజరాత్​ కాంగ్రెస్​ నేత హార్ధిక్​ పటేల్​

By

Published : Mar 19, 2019, 9:11 AM IST

Updated : Mar 19, 2019, 8:35 PM IST

భాజపాపై పాటీదార్​​ ఉద్యమ నేత హార్దిక్​​ పటేల్ ఎదురుదాడికి దిగారు
ఎన్నికల సమరం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ ఉద్ధృతమయింది. ట్విటర్​ వేదికగా భాజపా-కాంగ్రెస్​ వినూత్న ప్రచారాలు చేస్తున్నాయి. మోదీ చేపట్టిన 'మై బీ చౌకీదార్​' ప్రచారంపై పాటీదార్​ ఉద్యమనేత, కాంగ్రెస్​ నాయకుడుహార్దిక్​ పటేల్​ ఎదురుదాడికి చేశారు. మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ట్విటర్​ ఖాతాలోని తన పేరుకు ముందు బేరోజ్​గార్​ (నిరుద్యోగి) పదాన్ని జోడించుకున్నారు. ఆయన ట్విటర్​ ఖాతా 'బేరోజ్​గార్​ హార్దిక్​ పటేల్​'గా మారింది.

'చౌకీదార్​ చోర్​ హై '( కాపలదారే దొంగ) అని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలను ఇరుకునపెట్టేందుకు... దేశాభివృద్ధికి పాటుపడుతున్న ప్రతీ భారతీయుడూ చౌకీదారేనని ప్రధాని మోదీ అన్నారు. ట్విట్టర్​లో మై బీ చౌకీదార్​ హూ( నేనూ కాపలదారుడినే) ఉద్యమానికి పిలుపునిచ్చారు. 'చౌకీదార్'​ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు, అభిమానులు వారి ట్విట్టర్​ ఖాతాలకు చౌకీదార్​ పదాన్ని జోడిస్తున్నారు.

ట్రెండింగ్​లో..

కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు తమ ట్విట్టర్​​ ఖాతాలకు బేరోజ్​గార్​ పదాన్ని జోడించుకుంటున్నారనిగుజరాత్ కాంగ్రెస్​ ఐటీ విభాగం ఉపాధ్యక్షుడు హిరెన్​ బంకెర్​ తెలిపారు. బేరోజ్​గార్​ పదాన్ని కొంత మంది యువకులు తమ ట్విట్టర్​​ ఖాతాలకు జోడించారు. ఆదివారం నుంచి ఈ​ పదం ట్రెండింగ్​లో ఉంది.

బేరోజ్​గార్​ పదాన్ని ఇంకా అధికారికంగా కాంగ్రెస్​ స్వీకరించలేదని హిరెన్​ బంకెర్​ తెలిపారు. ఈ అంశంపై పార్టీ అగ్రనేతలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ ఆరోపణలు

రఫేల్​ ఒప్పందం అవినీతిలో కాపలాదారే దొంగ అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ అనేకసార్లు ఆరోపణలు చేశారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Last Updated : Mar 19, 2019, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details