తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంలో హార్దిక్​ పటేల్​కు చుక్కెదురు - హర్ధిక్ పటేల్

పాటిదార్ ఆందోళన్​లో చెలరేగిన అల్లర్ల కేసులో కిందికోర్టు తీర్పుపై స్టే విధించలేమన్న గుజరాత్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు హార్దిక్ పటేల్. అత్యవసర విచారణ చేపట్టాలని విన్నవించారు. ఇందుకు న్యాయస్థానం నిరాకరించారు.

సుప్రీంలో హార్ధిక్​ పటేల్​కు చుక్కెదురు!

By

Published : Apr 2, 2019, 6:32 PM IST

సుప్రీంలో హార్దిక్​ పటేల్​కు చుక్కెదురు!
కాంగ్రెస్ నేత, పాటిదార్ ఉద్యమ సారథి హార్దిక్​ పటేల్​కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను దోషిగా తేలుస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పాటిదార్ ఆందోళన్​లో చెలరేగిన అల్లర్లకు హార్దిక్కే బాధ్యుడంటూ కింది కోర్టు తీర్పునిచ్చింది. తీర్పుపై స్టే విధించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన. హార్దిక్ వినతిని మార్చి 29న గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు.

హార్దిక్ వినతిపై విచారించిన జస్టిస్ ఎమ్ ఎమ్ శంతన్​గౌడర్, జస్టిస్ నవీన్​ సిన్హాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.

స్టే ఎందుకు?

ఎన్నికల నియమావళి, గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన నిందితులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతారు. హార్దిక్​కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం 17 కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు రాజద్రోహం కేసులు.

జామ్​నగర్ నుంచి పోటీకి ఏర్పాట్లు...

హార్దిక్ పటేల్ గుజరాత్​లోని జామ్​నగర్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పాటిదార్ ఉద్యమనేత మార్చి 12న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్​లోని 26 లోక్​సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details