తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కిడ్నీ అమ్మి అప్పు తీర్చిన టీచర్.. అయినా​!

తాను చేసిన అప్పు తీర్చడం కోసం కిడ్నీని అమ్మాడో ఉపాధ్యాయుడు. ఇందుకోసం దేశం కాని దేశం వెళ్లొచ్చాడు. తీసుకున్న సొమ్ముకు ఏడాదిలోపే వడ్డీతో సహా చెల్లించాడు. అయినా బాకీ తీరలేదని వడ్డీవ్యాపారులు వేధించడం వల్ల.. వారిపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

Harassed by moneylenders, Gujarat teacher sells kidney
అప్పిచ్చినవాళ్ల వేధింపులు తాళలేక కిడ్నీ అమ్మిన టీచర్​!

By

Published : Aug 17, 2020, 10:10 PM IST

గుజరాత్​లో ఓ ఉపాధ్యాయుడు తన అవసరం కోసం వడ్డీవ్యాపారుల​ వద్ద అప్పుచేశాడు. వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఇటీవలే తన కిడ్నీని అమ్మి మరీ వడ్డీతో సహా బాకీ తీర్చేశాడు. అయినప్పటికీ ఇంకా డబ్బు రావాల్సి ఉందని అప్పిచ్చిన వారు వేధించారు. ఇక తట్టుకోలేక పోలీస్​ స్టేషన్​కు వెళ్లాడా బాధితుడు.

అసలేం జరిగిందంటే.?

బనాస్కంతకు చెందిన రాజాభాయ్​ పురోహిత్​ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. ఒకసారి అవసరానికి​ రుణదాతల వద్ద రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము కాస్తా ఏడాదిలోపే వడ్డీతో కలిపి అసలుకు రెట్టింపైంది.

అంత మొత్తం తాను చెల్లించలేనని తన కిడ్నీలను అమ్మాలనుకున్నాడు. సోషల్​ మీడియాలో యాడ్​ ఇచ్చాడు. ఈ విషయం తెలిసి శ్రీలంకకు చెందిన ఓ వైద్యుడు కిడ్నీలను కొనేందుకు ముందుకొచ్చాడు. ఎలాగైనా బాకీ తీర్చాలనుకున్న పురోహిత్​.. లంకకు వెళ్లి రూ.15 లక్షలకు తన కిడ్నీ ఒకటి అమ్మేశాడు. వచ్చిన సొమ్ముతో వడ్డీతో సహా మొత్తం అప్పు చెల్లించాడు.

అయినా తప్పని వేధింపులు..

చేసిన అప్పు కన్నా ఎక్కువ మొత్తమే చెల్లించినప్పటికీ ఇంకా బాకీ ఉన్నావంటూ పురోహిత్​ను వేధించారా రుణదాతలు. వారి హింసను తట్టుకోలేని పురోహిత్​.. స్థానిక పోలీస్​ స్టేషన్​లో రుణం ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:వరదలో చిక్కిన యువకుడ్ని కాపాడిన వాయుసేన

ABOUT THE AUTHOR

...view details