పసుపులోని కర్కుమిన్ క్యాన్సర్ చికిత్సలో అద్భుతంగా పనికొస్తుందని చెన్నైలోని ఐఐటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది క్యాన్సర్ కణాల మరణాన్ని పెంచుతుందని తెలిపారు. తద్వారా బాధితులకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు.
కర్కుమిన్‌పై పరిశీలన..
పసుపులోని కర్కుమిన్ క్యాన్సర్ చికిత్సలో అద్భుతంగా పనికొస్తుందని చెన్నైలోని ఐఐటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది క్యాన్సర్ కణాల మరణాన్ని పెంచుతుందని తెలిపారు. తద్వారా బాధితులకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు.
కర్కుమిన్‌పై పరిశీలన..
క్యాన్సర్ కణాన్ని చంపడం చాలా ముఖ్యం. శరీరంలోని ఆరోగ్యకరమైన ఇతర కణాలకు పెద్దగా నష్టం లేకుండా ఈ ప్రక్రియ జరగాలి. ఇందుకోసం 'అపోప్టోసిస్' మార్గం మెరుగైంది. ఇది ఒకరకంగా.. క్యాన్సర్ కణాన్ని మరణానికి గురిచేసేలా ప్రోగ్రామ్ చేయడం లాంటిది. ఇందుకు టీఎన్‌ఎఫ్-రిలేటెడ్ అపోప్టోసిస్ ఇండ్యూసింగ్ లైగాండ్ (ట్రెయిల్) అనే ప్రొటీన్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను గుర్తించి, చంపే సామర్థ్యం దీనికి ఉంది. అయితే దీర్ఘకాలంలో క్యాన్సర్ కణాలు ఈ ప్రొటీన్‌ను అధిగమించే సామర్థ్యాన్ని సముపార్జించుకుంటున్నట్లు తేలింది. అందువల్ల ఈ నిరోధకతను అధిగమించేలా చూడటంతోపాటు క్యాన్సర్ కణాలు 'ట్రెయిల్' తాకిడికి ఎక్కువగా గురయ్యే విధానాన్ని కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం సహజసిద్ధ పదార్థాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. చెన్నైలోని ఐఐటీ పరిశోధకులు కర్కుమిన్‌పై పరిశీలన చేపట్టారు. 'ట్రెయిల్'ను నిరోధించే మొండి క్యాన్సర్ కణాలనూ అపోప్టోసిస్‌కు గురయ్యేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నట్లు వారు నిర్ధరించారు.
ప్రొస్టేట్, రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్లలో ఇది పనిచేస్తున్నట్లు తేలిందని వెల్లడించారు శాస్త్రవేత్తలు.
ఇదీ చూడండి: రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!