దేశంలోని అందమైన ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, మేఘాలయతో పాటు అరుణాచల్‌ప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్రంలో ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పర్యటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి ఈ రాష్ట్రం మంచి ఎంపిక. ప్రపంచానికి తెలియని ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం రండి...
దేశంలోనే 300 మీటర్ల పొడవైన సింగిల్-లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెన ఇక్కడ ఉంది. ఈ వంతెన ప్రధాన పర్యటక ప్రాంతంగా గుర్తింపు పొందింది.
యమునా నది మీద వెదురు బొంగులతో నిర్మించిన మరొక వంతెన కూడా ఇక్కడికి వచ్చే పర్యటకుల మనసు దోచేస్తోంది. దీనిని కర్రలు, తాళ్లతో రూపొందించారు. మనుషులు నడవటం కోసం నడిభాగంలో వెదురు బొంగుల అమరికను పేర్చారు. ఈ వంతెనను గిరిజనుల సంస్కృతికి చిహ్నంగా అభివర్ణిస్తారు.
దాదాపు 1000 అడుగుల పొడవుగల ఈ వంతెనను.. గిరిపుత్రులు వారి రోజువారీ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుంటారు.