తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాపై పోరులో చేతులు కడుక్కోవడమే ముఖ్యం'

ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేయటానికి కీలక సూచన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). వ్యాక్సిన్​ అందుబాటులో లేని ఈ సమయంలో.. చేతులు కడుక్కోవడం వల్లే కొవిడ్​-19 వ్యాప్తిని నియంత్రించగలమని అభిప్రాయపడింది.

WHO
కరోనాపై పోరులో చేతులు కడుక్కోవడమే ముఖ్యం: డబ్ల్యూహెచ్​ఓ

By

Published : Oct 15, 2020, 5:47 PM IST

కరోనా విలయం మొదలై దాదాపు పది నెలలు గడుస్తోంది. ప్రజలు వైరస్​ ఇబ్బందులతో అవస్థలు పడుతుంటే.. ప్రభుత్వాలు, పరిశోధకులు కొవిడ్​ను ఎదుర్కోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా మరోసారి సూచనలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భౌతిక దూరం, దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవడం, మాస్కు ధరించడమే కాకుండా సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వెల్లడించింది. ఇవే వ్యాక్సిన్​ వచ్చే వరకు ఉన్న ఉపయుక్తమైన, సులభమైన మార్గాలుగా అభివర్ణించింది. ప్రస్తుతం ఈ విధానంతోనే ప్రాణాలు రక్షించుకోగలమని అభిప్రాయపడింది డబ్ల్యూహెచ్​ఓ

అక్టోబర్​ 15న 'గ్లోబల్​ హ్యాండ్​ వాషింగ్​ డే' సందర్భంగా ఈ సూచనలు చేసింది డబ్ల్యూహెచ్​ఓ. ప్రతి ఏటా ఈ రోజున శుభ్రతపై అవగాహన కల్పిస్తుంది.

"చేతులు కడుక్కోవడం వ్యాధులను అరికట్టడానికి ఉన్న అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. మనల్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. కరోనా నివారణలో చేతుల కడుక్కోవడం చాలా ముఖ్యం. కొవిడ్​ దెబ్బతో ప్రజల జీవన అలవాట్లలో మార్పులు వచ్చాయి. ప్రతి ఒక్కరి జీవితంలో శుభ్రత భాగమైంది. ఈ కరోనా కాలంలో శుభ్రతను పాటిస్తేనే వ్యాధి నుంచి రక్షించుకోగలం."

--డా.పూనమ్​ ఖేత్రపాల్​ సింగ్​, డబ్ల్యూహెచ్​ఓ ఆగ్నేయ ప్రాంత​ డైరెక్టర్​

బాధితుడి దగ్గు, తుమ్ము ద్వారా వచ్చే తుంపర్లు, నోటి స్రవాలు, ఆ వ్యక్తి ముట్టుకున్న ఉపరితలాన్ని ముట్టుకోవడం వల్ల కరోనా వ్యాప్తి జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కాబట్టి చేతులను సబ్బుతో కడుక్కోవడం, ముక్కును తాకకుండా ఉండటం వంటివి చేయటం ముఖ్యమని తెలిపింది. అందుకే ఏ వస్తువులను పట్టుకున్నా శానిటైజర్​ రాసుకోవాలని లేదంటే శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details