తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంకల్పంతో సైకిల్​పై దివ్యాంగుడి 296 కి.మీ ప్రయాణం - handicap traveling 296 km on one foot from surat

లాక్​డౌన్​లో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నడుస్తూ.. మరికొంతమంది సైకిళ్లపై స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. ఇదే కోవలో 296 కిమీ దూరాన్ని ఒంటికాలుపై ఛేదిస్తున్నాడు ఓ వ్యక్తి. శరీరంలోని లోపం కంటే సంకల్పబలమే గొప్పదని నిరూపిస్తున్నాడు.

handicap traveling
సంకల్పమే ఇంధనం- సైకిల్​పై దివ్యాంగుడి 296 కి.మీ ప్రయాణం

By

Published : May 7, 2020, 10:05 AM IST

లాక్​డౌన్​లో చేసేందుకు పనుల్లేక.. చేతిలో డబ్బుల్లేక.. ఇంటికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాల్లేక వలస కూలీలు పడిన కష్టం అంతా ఇంతా కాదు. కూలీల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వారికోసం ప్రత్యేక రైళ్లు నడపాలని సంకల్పించింది. అయితే... ఇప్పటికే వేల సంఖ్యలో వలస కూలీలు రకరకాల సాహసాలు చేసి స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. ఇదీ రీతిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు గుజరాత్​లో చిక్కుకుపోయిన ఓ దివ్యాంగుడు. సైకిల్​పై 296 కిలోమీటర్ల యాత్రను చేపట్టాడు.

గుజరాత్ సూరత్​లో ఇటుకల బట్టీలో పనిచేసేవాడు మహారాష్ట్ర జల్​గావ్​ జిల్లా.. నాగల్​వాడీ వాసి సాగర్. అతడు దివ్యాంగుడు. లాక్​డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సూరత్​ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొద్దిసేపు నడుస్తూ.. కొంత సమయం సైకిల్ తొక్కుతూ ముందుకు సాగుతున్నాడు. గురువారం సాయంత్రానికి సాగర్​ స్వగ్రామానికి చేరుకుంటాడని తెలుస్తోంది.

సంకల్పమే ఇంధనం- సైకిల్​పై దివ్యాంగుడి 296 కి.మీ ప్రయాణం

ఇదీ చూడండి:నవీముంబయి తీరంలో 'ఫ్లెమింగో' స్వేచ్ఛా విహారం

For All Latest Updates

TAGGED:

Nandurbar

ABOUT THE AUTHOR

...view details