హిమాచల్‌ప్రదేశ్ హమీర్‌పూర్‌కు చెందిన అజయ్ శర్మ.. యోగాలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అత్యంత కష్టమైన వృక్షాసనాన్ని ఏకధాటిగా 1గంట 30నిమిషాల 30సెకన్లు ప్రదర్శించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆల్ ఇండియా యోగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఆన్లైన్ యోగా పోటీలో.. 17 రాష్ట్రాల అభ్యర్థులు పాల్గొనగా.. అజయ్ శర్మ విజేతగా నిలవడం విశేషం.
'వృక్షాసనం'తో హమీర్పూర్వాసి ప్రపంచ రికార్డు
హిమాచల్‌ప్రదేశ్ హమీర్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి.. యోగాసనాలతో ప్రపంచ రికార్డు సృష్టించారు. అత్యంత కష్టమైన 'వృక్షాసనాన్ని' ఏకంగా 1గంట 30నిమిషాల 30సెకన్ల పాటు వేసి ఔరా! అనిపించారు.
'వృక్షాసనం'తో హమీర్పూర్వాసి ప్రపంచ రికార్డు
పల్లె నుంచే ప్రపంచ రికార్డు :
అజయ్‌శర్మ మత్తహానీ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచే యోగా చేయటం ప్రారంభించారు. ఆయన స్వస్థలం హమీర్‌పూర్‌లోని ఓ మారుమూల గ్రామం. యోగా ప్రాముఖ్యతను గ్రామంలో వివరించేవారు. యోగా చేస్తే రోగాలకు దూరంగా ఉండొచ్చని అజయ్ శర్మ అందరికీ తెలియచెప్పేవారు. ప్రపంచ రికార్డు సాధించిన్నందుకు అజయ్ శర్మ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది.
Last Updated : Oct 13, 2020, 5:27 PM IST