తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పటికి రూ.లక్ష కోట్ల ఆర్డర్ల మార్క్​ను దాటేస్తాం'

హిందూస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ తయారు చేస్తోన్న యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే 83 తేజస్​ విమానాలను కొనేందుకు భారత వాయుసేన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వచ్చే ఏడాది చివరి నాటికి తమ సంస్థకు వచ్చే ఆర్డర్ల విలువ లక్ష కోట్లు దాటుతుందని ఆ సంస్థ సీఎండీ తెలిపారు.

HAL's order book expected to cross Rs one lakh crore next year, says CMD
అప్పటికి రూ.లక్షకోట్లు ఆర్డర్ల మార్క్​ను దాటేస్తాం:హాల్​

By

Published : Feb 4, 2021, 10:38 PM IST

ప్రభుత్వ రంగ వైమానిక సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్​(హాల్​)​ తయారు చేస్తోన్న విమానాలకు రోజురోజుకు డిమాండ్​ పెరుగుతోంది. వచ్చే ఏడాది కల్లా హాల్​కు వచ్చే ఆర్డర్ల విలువ రూ.లక్ష కోట్లు మార్కును దాటుతుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం హాల్​​కు రూ.53 వేల కోట్లు విలువైన ఆర్డర్లు ఉన్నాయని.. తేజస్​ను కూడా చేరిస్తే ఆ విలువ రూ. 80 వేల కోట్లుకు చేరుతుందని ఆ సంస్థ సీఎండీ మాధవన్​ తెలిపారు.

వచ్చే ఏడాది చివరినాటికి రూ.లక్షకోట్లు ఆర్డర్ల మార్క్​ను దాటేస్తాం​

తేలికపాటి పోరాట హెలికాఫ్టర్లు, హెట్​టీటీ-40 విమానాలను కొనుగోలు చేసేందుకు మరో రెండు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని.. వచ్చే సంవత్సరం చివరి నాటికి లక్ష కోట్ల రూపాయల మార్కును దాటుతామని మాధవన్​ ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్​టీటీ-40 శిక్షణా విమానాల కోసం భారత వాయుసేన.. హాల్​కు ప్రతిపాదనా విజ్ఞప్తి-ఆర్​​ఎఫ్​పీని జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆర్థికంగా, ప్రదర్శన పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను తమ సంస్థ చేరుకుంటుందని మాధవన్​ విశ్వాసం వ్యక్తం చేశారు.

తొమ్మిదేళ్ల ప్రాజెక్టు!

హాల్​ నుంచి​ 73 తేజస్ ఎంకే-1ఏ రకం విమానాలు, 10 తేజస్​ శిక్షణా విమానాలను రూ.48వేల కోట్లకు కొనుగోలు చేసేలా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నట్లు మాధవన్​ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఇప్పటి నుంచి 36 నెలల్లో విమానాలను అందజేసే ప్రక్రియను హాల్​ ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. మొదటి విమానం 2024మార్చి నాటికి చేరుతుందన్నారు. మొదట రెండు విమానాలు డెలివరీ చేసి.. తర్వాత ఆ సంఖ్యను 16కు పెంచుతామని తెలిపారు. తొలి విమానం డెలీవరీ అయిన నాటి నుంచి ఆరేళ్లలో మిగతా విమానాలు సరఫరా అవుతాయన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు సమయం తొమ్మిదేళ్లని మాధవన్​ చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 463 ప్రైవేటు సంస్థలు భాగమయ్యాయని వివరించారు. ఇందులో పెద్ద సంస్థలతో పాటు ఎంఎస్​ఎంఈలు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.

విమాన తయారీలో దేశీయ ఉత్పత్తులు 52 శాతం ఉండగా.. ముడి పదార్థాలను దేశీయ సంస్థల వద్ద కొనడం ద్వారా దాన్ని 65 శాతానికి పెంచేందుకు యోచిస్తున్నట్లు హాల్​ తెలిపింది. ఈ మేరకు యుద్ధ విమానాల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల సరఫరా కోసం జీఈ ఏవియేషన్​తో రూ.100 కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు హాల్​ తెలిపింది. ఈ ఒప్పందాన్ని ఐదేళ్లుకు కుదుర్చుకున్నట్లు తెలిపిన హాల్​.. ఉక్కు, నికెల్ మిశ్రమంలో ముడిపదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.

యుద్ధ విమాన ధర రూ.309 కోట్లు కాగా.. శిక్షణా విమాన ధర రూ.280 కోట్లు అని వెల్లడించింది.

ఇదీ చూడండి:'రఫేల్ రాక​తో చైనా శిబిరంలో ఆందోళన'

ABOUT THE AUTHOR

...view details