సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అనేక రక్షణ పరికరాల పనితీరు పరీక్షలను భారత్ వేగవంతం చేసింది. తాజాగా హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ (హాల్) తయారు చేసిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ ఎల్‌యూహెచ్ పరీక్షలను పూర్తి చేసుకుంది. ఎత్తైన హిమాలయ పర్వత సానువులు, అత్యంత వేడి ప్రదేశాల్లో నిర్వహించిన పరీక్షల్లో ఎల్‌యూహెచ్ పాసైంది.
ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమిగా పేరుగాంచిన సియాచిన్ గ్లేసియర్‌పై నిర్వహించిన టెస్టుల్లోనూ ఎల్‌యూహెచ్ పాసైనట్లు హాల్ వెల్లడించింది. ఇక్కడ యుద్ధ సామగ్రి మోసే హెలికాప్టర్ సామర్థ్యాన్ని పరీక్షించారు.