తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అర కేజీ వెంట్రుకలను ఆరగించేసింది-ఎందుకో తెలుసా! - అర కేజీ వెంట్రుకలను ఆరగించేసింది-ఎందుకో తెలుసా!

​​​​​​​తమిళనాడులో ఓ 13 ఏళ్ల అమ్మాయికి సర్జరీ చేసి అరకేజీ వెంట్రుకలు, ఖాళీ షాంపూ ప్యాకెట్లను బయటకు తీశారు వైద్యులు. వాటిని చూసి డాక్టర్లు నివ్వెరపోయారు. ఇంతకీ అవి ఆమె కడుపులోకి ఎలా చేరాయి?

Half kg human hair, empty shampoo packets removed from girl's   stomach
అర కేజీ వెంట్రుకలను ఆరగించేసింది-ఎందుకో తెలుసా!

By

Published : Jan 27, 2020, 10:09 PM IST

Updated : Feb 28, 2020, 4:56 AM IST

తమిళనాడు కోయంబత్తూర్​లో ఓ 13 ఏళ్ల అమ్మాయికి సర్జరీ చేసి కడుపులో నుంచి అరకేజీ వెంట్రుకలు, ఖాళీ షాంపూ ప్యాకెట్లను బయటకు తీశారు వైద్యులు. ఆమె పరిస్థితి, ఆ వెంట్రుకులను చూసి వైద్యులు నివ్వెరపోయారు.

ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక గత కొంత కాలంగా కడుపునోప్పితో బాధపడుతుండేది. భయాందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్​ చేసిన వైద్యులు... కడుపులో ఓ గడ్డను గుర్తించారు. మొదట ఎండోస్కోపీ పద్దతి ద్వారా వాటిని తొలగించాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. దీనితో డాక్టర్​ గోకుల్​ క్రిప్​ శంకర్​ బృందం సర్జరీకి సిద్ధపడింది. అనంతరం కడుపులో నుంచి అరకేజీ జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లు బయటకువచ్చాయి.

'అందుకే తినేసింది'

ఇటీవలే దగ్గరి బంధువు ఒకరు మరణించడం వల్ల ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోయిందని, ఆ సమయంలోనే వెంట్రుకలు, ఖాళీ షాంపు ప్యాకెట్లను తినేసిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టం చేశారు.

అర కేజీ వెంట్రుకలను ఆరగించేసింది-ఎందుకో తెలుసా!

ఇదీ చూడండి:మానవత్వం చేరదీసింది.. పచ్చదనం వెల్లివిరిసింది

Last Updated : Feb 28, 2020, 4:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details