జమ్ముకశ్మీర్ హాజీపుర్ సెక్టార్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు పాకిస్థాన్ సైనికులను హతమార్చాయి. తప్పు గ్రహించిన దాయాది తెల్ల జెండా చూపి.. తన సైనికుల మృత దేహాలను స్వాధీనం చేసుకుంది.
భారత్ దెబ్బకు తెల్ల జెండాలతో పాక్ సేనల పరుగులు - కాల్పుల విరమణ ఒప్పందం
కశ్మీర్ హాజీపుర్ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌కు భద్రతాదళాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఇద్దరు పాక్ సైనికులను హతమార్చాయి. పాక్ తెల్ల జెండా చూపి తన సైనికుల మృత దేహాలను స్వాధీనం చేసుకుంది.
భారత భద్రతా దళాలకు తెల్ల జెండా చూపిన పాక్
ఈ నెల 10, 11వ తేదీల్లో పాకిస్థాన్ కాల్పుల నియంత్రణ ఒప్పందాన్ని ఉల్లఘించి హాజీపుర్ సెక్టార్ వెంబడి దాడులు నిర్వహించింది. దీటుగా స్పందించిన భద్రతా దళాలు ఇద్దరు పాక్ సైనికులను మట్టుబెట్టాయి. అంతర్జాతీయ యుద్ధ నియమాల ప్రకారం... తెల్ల జెండా చూపిన పాకిస్థాన్‌కు వారి సైనికులను తీసుకునిపోయే వీలు కల్పించింది భారత సైన్యం.
ఇదీ చూడండి: రోగిని 25 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్థులు!
Last Updated : Sep 30, 2019, 1:47 PM IST